ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే అన్ని విషయాలను కూడా ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే ఎవరైనా ఏ చిన్న పొరపాటు చేసిన కూడా వారిపై విమర్శలు చేస్తూ ఇక సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్  చేయడం మొదలు పెడుతూ ఉన్నారు అని చెప్పాలి. తట్టివారైనా కూడా వదిలిపెట్టకుండా ట్రోలింగ్ చేయడం నేటి  రోజుల్లో కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఇక క్రికెటర్లు ఏదైనా తప్పు చేసారు అంటే చాలు ఇక ఇలాంటి ట్రోలింగ్ ను ఎదుర్కోవడం సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది.


 ఇక ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఒకప్పటి వరల్డ్ కప్ వీరుడు జోగిందర్ శర్మ సైతం ఇలాగే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతను రిటైర్మెంట్ ప్రకటించడం విషయంలో ఉన్న ఒక చిన్న విషయాన్ని గమనించిన నేటిజన్స్ చివరికి అతని ట్రోల్స్ చేస్తూ ఒక ఆట ఆడుకుంటున్నారు. 2007లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉండి హీరోగా పేరు తెచ్చుకున్న నీకు ఈ మాత్రం తెలియదా అంటూ ఇక తెగ విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే జోగేందర్  శర్మను టార్గెట్ చేస్తూ ఇలాంటి విమర్శలు చేయడానికి వెనుక ఒక పెద్ద కారణాలు ఉంది.


 2007 ప్రపంచ కప్ లో చివరి ఓవర్ వేసి ఇక జట్టుకు విజయాన్ని అందించి కోట్లాది క్రికెట్ ప్రేమికులకు హీరో అయిపోయాడు జోగేందర్ శర్మ. ఇకపోతే ఇటీవల అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. అతని కెరియర్లో కేవలం నాలుగు వన్డేలు నాలుగు టి20 మ్యాచ్ లను మాత్రమే ఆడి.. దేశ వాళి క్రికెట్లో కూడా పెద్దగా కనిపించలేదు. అయితే జోగేందర్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడానికి కొన్ని రోజుల ముందే మరో వెటరన్ ఆటగాడు మురళి విజయ్ కూడా తన రిటైర్మెంట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే మురళి విజయ్ తన రిటైర్మెంట్ కు సంబంధించి ఏదైతే పోస్ట్ పెట్టాడో ఇక అదే పోస్టుని జోగేందర్ శర్మ కాపీ పేస్ట్ చేశాడు. కేవలం తాను ఆడిన క్రికెట్ అసోసియేషన్ పేర్లు మాత్రమే మారుస్తూ ఇక ట్విట్టర్లో తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. దీంతో ఇది గమనించి నేటిజన్స్ వరల్డ్ కప్ హీరో అయినా నీకు కనీసం రిటైర్మెంట్ ప్రకటనలో కాపీ కొట్టొద్దు అన్న విషయం తెలియదా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: