అయితే ఇప్పుడు వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయం లో ఆటగాళ్లు ఇలా పొరపాటున నిబంధనలు ఉల్లంఘించడం గురించి ఎన్నోసార్లు విన్నాం. కానీ ఏకంగా అంపైర్లు గా వ్యవహరిస్తున్న వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘించడం మాత్రం దాదాపు జరగదు అని చెప్పాలి. కానీ ఇటీవలే ఒక ఉత్కంఠ భరితమైన పోరు లో మాత్రం ఫీల్డ్ ఎంపైర్లుచేసిన తప్పిదం ప్రస్తుతం అందరిని ఆశ్చర్య పరుస్తూ ఉంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా వేదికగా ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.
ఇక ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో అంపైర్ల నుండి ఘోర తప్పిదం చోటుచేసుకుంది అని చెప్పాలి. అయితే భారత్ టార్గెట్ చేదిస్తున్న సమయంలో ఏడవ ఓవర్ వేసిన పాకిస్తాన్ బౌలర్ నినాదార్ ను ఏకంగా ఆరుకు బదులు ఏడు బంతులు వేయించారు బౌలర్లు. అయితే ఏడవ బంతికి ఫోర్ వచ్చింది అని చెప్పాలి. ఇక పాకిస్తాన్ అభిమానులు తమ జట్టు ఓటమికి ఈ కారడాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 20 ఓవర్లలో149 పరుగులు చేస్తే భారత జట్టు 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి