అయితే ప్రస్తుతం టీమిండియా జట్టులో అటు విరాట్ కోహ్లీకి సహచరుడిగా స్టార్ ప్లేయర్ గా రోహిత్ శర్మ ఉన్నప్పటికీ ఎందుకో మాజీ కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లీకి ఇప్పటికీ కూడా ఊహించని రీతిలో పాపులారిటీ ఉంది అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీకి ఉన్న విపరీతమైన ఫామ్ కారణంగా ఇక కెప్టెన్ రోహిత్ శర్మకు రావాల్సినంత గుర్తింపు రాలేదు అంటూ ఇటీవలే ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ చాపెల్ చెప్పుకొచ్చాడు. రెండవ టెస్టుకు ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. మొదటి టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ తో కదం తొక్కాడు అన్న విషయం తెలిసిందే. కోహ్లీ మాత్రం 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఇయాన్ చాపెల్ మాట్లాడుతూ.. టెస్ట్ క్రికెట్ ఓపెనర్ గా ముందుకు వెళ్లడం రోహిత్ శర్మ కెరియర్ను కాపాడింది.
మిడిల్ ఆర్డర్లో వచ్చి ఉంటే మాత్రం అతని టాలెంట్ మొత్తం వృధా అయ్యేది. అయితే గత దశాబ్దంలో కోహ్లీకి విపరీతమైన పాపులరిటీ వచ్చింది. దీంతో రోహిత్ కు రావలసిన గుర్తింపు రాలేదు. కానీ తిరిగి పుంజుకోవడంలో కెప్టెన్సీ కూడా కీలకపాత్ర పోషించింది. ముందుకు నడిపించేందుకు కావలసిన క్రమశిక్షణ రోహిత్ సొంతం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. ఇక రోహిత్ బాటలోనే రవీంద్ర జడేజా కూడా బ్యాట్ జలీపించాడు అంటూ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి