ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు  భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలోనే వరుసగా మ్యాచులు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టును అనుక్షణం భయపడేలా చేస్తూ ఉన్నాడు భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. తన స్పిన్ బౌలింగ్ తో  ఆస్ట్రేలియా జట్టులో ఉన్న స్టార్ బ్యాట్స్మెన్ లను సైతం పెవెలియన్ పంపించడంలో సక్సెస్ అవుతూ ఉన్నాడు అని చెప్పాలి.  ఇక అతను ఎంతలా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లను భయపెడుతున్నాడు అంటే అతన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా అతనిలాగే బౌలింగ్ చేసే ఒక యువ బౌలర్ ను నియమించుకొని మరి ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేస్తుంది అని చెప్పాలి.


 దీన్నిబట్టి ఇక ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లకు అశ్విన్ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు అన్నది అర్థమవుతుంది. అదే సమయంలో ఇక అంచనాలకు తగ్గట్లుగానే మంచి ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నారు.ఈ క్రమంలోనే ఎన్నో అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నాడు ఈ సీనియర్ బౌలర్. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియా భారత్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టులో భాగంగా టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ప్రదర్శనతో మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.


 ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో వికెట్లు పడగొట్టడం విషయంలో అశ్విన్ ఎన్నో అరుదైన రికార్డులు సృష్టించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కేవలం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చరిత్రలోనే 100 వికెట్లు తీసిన బౌలర్గా మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అయితే అశ్విన్ ఈ ఘనత సాధించిన రెండవ బౌలర్ కావడం గమనార్హం. ఇక ఈ లిస్టులో తొలి స్థానంలో భారత దిగ్గజ ఆటగాడు అనిల్ కుంబ్లే ఉన్నాడు అని చెప్పాలి. అంతేకాకుండా రెండవ టెస్టు మ్యాచ్లో అలెక్స్ కేరి వికెట్ తీయడం ద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 700 వికెట్ల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా కూడా అశ్విన్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: