ఈ క్రమంలోనే ఇలాంటి అద్భుతమైన క్యాష్ లు మ్యాచ్ లో జరిగింది అంటే చాలు అయ్యయ్యో ఇలాంటి క్యాచ్ నీ నేరుగా చూడటం మిస్ అయ్యామే అని ఎంతోమంది క్రికెట్ ప్రేక్షకులు కూడా అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా భారత్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో కూడా ఇలాంటి అద్భుతమైన క్యాచ్ కు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకొని ప్రత్యర్థి బ్యాటర్ ఉస్మాన్ ఖవాజాను పెవిలియన్ పంపించడంలో సక్సెస్ అయ్యాడు.
స్వతహాగా వికెట్ కీపర్ అయినా కేఎల్ రాహుల్ ఫీల్డింగుకు వస్తే మాత్రం చురుగ్గా ఉండడు అనే అపవాదు కూడా మూట కట్టుకున్నాడు. కానీ ఇటీవల జరిగిన మ్యాచ్ లో మాత్రం అతని క్యాచ్ చూసిన తర్వాత ఇన్నాళ్ల వరకు అతను చురుకుగా ఉండడు అని విమర్శలు చేసిన వారి నోటికి తాళం పడిపోతుంది అని చెప్పాలి. రెండో టెస్టులో భాగంగా 125 బంతుల్లో 81 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఉస్మాన్ ఖావాజా. సెంచరీ వైపుగా దూసుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే 46వ ఓవర్ వేసేందుకు వచ్చాడు జడేజా. ఇక ఐదవ బంతిని రివర్స్ స్వీప్ షాట్ కొట్టేందుకు ఖవాజా ప్రయత్నించాడు. కానీ బంతి ఆఫ్ సైడ్ లో ఉన్న కేఎల్ రాహుల్ వైపుగా వెళ్లడంతో వెంటనే స్పందించిన రాహుల్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టుకున్నాడు. ఈ క్యాచ్ చూసి అటు ఖవాజా సైతం తెల్ల మొహం వేశాడు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి