ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టుకు గెలిచేందుకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతూ వరుసగా మ్యాచ్ లలో విజయం సాధిస్తూ దూసుకుపోతుంది టీమిండియా. ఈ క్రమంలోనే ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్లలో కూడా ఘనవిజయాన్ని అందుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక అటు భారత ఆటగాళ్లు కూడా మంచి ప్రదర్శన కనబరుస్తూ ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా కొల్లగోడుతున్నారు. ఇకపోతే ఆస్ట్రేలియా తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ద్వారా అటు భారత క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న పూజార ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
భారత టెస్ట్ క్రికెట్ హిస్టరీలో కేవలం కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే పరిమితమైన 100వ టెస్ట్ మ్యాచ్ అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో పూజార పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ అతనికి 100వ మ్యాచ్ అయిన టెస్టులో మాత్రం భారత్ విజయం సాధించింది. ఈ విషయంపై మాట్లాడుతూ.. నేను ఆడిన 100 టెస్ట్ లో జట్టు విజయం సాధించడం నిజంగా నా కెరియర్ లో ఎంతో ప్రత్యేకం. మొదటి ఇన్నింగ్స్ లో పరుగులు చేయకపోయినా రెండో ఇన్నింగ్స్ లో విన్నింగ్ షాట్ కొట్టడం ఎంతగానో సంతోషాన్ని ఇచ్చింది. మిగిలిన రెండు టెస్టులలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తా.. భారత్ బౌలర్లు అద్భుతంగా రానించి జట్టుకు విజయాన్ని అందించారు అంటూ పూజార చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి