దీంతో దినేష్ కార్తీక్ కెరియర్ ముగిసిపోయిందని.. ఇక టీమ్ ఇండియాలో చోటు దక్కుతుంది అని ఆశలు పెట్టుకోవడం అతను మానుకోవాలి అంటూ ఎంతోమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలోనే 2022 ఐపీఎల్ సీజన్లో అతని ప్రదర్శన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా మెరుపు ఇన్నింగ్స్ లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును గెలిపించిన తీరు క్రికెట్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. దినేష్ కార్తీక్ లో ఇలాంటి పవర్ హిట్టర్ కూడా ఉన్నాడా అని అందరిని ఆలోచనలో పడిపోయేలా చేసింది.
ఈ క్రమంలోనే తన పవర్ హిట్టింగ్ తో సెలెక్టర్ల చూపును ఆకర్షించి జట్టులోకి వచ్చాడు. ఇక ఆ తర్వాత ఏకంగా గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో కూడా చోటు సంపాదించుకున్నాడు. కానీ అప్పటివరకు బ్యాటింగ్ లో దంచి కొట్టిన దినేష్ కార్తీక్ వరల్డ్ కప్ లో పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో సెలెక్టర్లు వెంటనే అతని పక్కన పెట్టేశారు. అయితే వరల్డ్ కప్ లో నిరాశ పరిచిన దినేష్ కార్తీక్ మళ్ళీ ఐపీఎల్ మోడ్ లోకి వచ్చేసాడు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 38 బంతుల్లో ఐదు ఫోర్లు ఆరు సిక్సర్ల సహాయంతో 75 పరుగులు సాధించాడు. ఇక అతని బ్యాటింగ్ కారణంగానే అతను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. డివై పాటిల్ టి20 కప్ 2023 సూపర్ లీగ్ లో భాగంగా డివై పార్టీలు గ్రూప్ బి టీం.. ఆర్.బి.ఐ మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు దినేష్ కార్తీక్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి