
ఇటీవల కాలంలో అంతర్జాతీయ క్రికెట్లో అన్ని జట్లు కూడా మెరుగైన ఫీల్డింగ్ ప్రమాణాలతోనే కొనసాగుతూ ఉన్నాయి. కానీ కొన్ని జట్లు తమ ఫీల్డింగ్ తో ఎప్పుడు క్రికెట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. క్రికెట్ లో ఇలాంటి ఆటగాళ్లు కూడా ఉంటారా అని వైరల్ గా మారిపోయిన వీడియోలను చూసినప్పుడు క్రికెట్ ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి ఒక ఫన్నీ వీడియో ఒకటి ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక్కడ ఒక ఫీల్డర్ బౌండరీ వెళ్తున్న బంతిని ఆపేందుకు పడిన కష్టం చూసి ప్రతి ఒక్కరు కూడా కడుపుబ్బ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి.
అంతేకాదు ఇక ఈ వీడియోని రిపీట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ చూసేస్తున్నారు అని చెప్పాలి. ఇక ఇది ఒక క్లబ్ క్రికెట్లో జరిగింది అన్నది తెలుస్తుంది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఫీల్డర్ బౌండరీ ని ఆపే క్రమం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా మన కాళ్ళకి పట్టిన దరిద్రం త్వరగా వదలదు అని పెద్దలు అంటూ ఉంటారు. ఈ ఫీల్డర్ ను చూసిన తర్వాత ఇది నిజమేమో అని అనిపిస్తూ ఉంటుంది. బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ ఏదో ఆడాలని ప్రయత్నిస్తే.. అది ఇంకోచోట తాకి థర్డ్ మాన్ దిశగా వెళ్ళింది. అయితే బంతి స్పీడ్ గా వెళ్ళింది అనుకుంటే పొరపాటే.. అక్కడే ఉన్న ఫీల్డర్ క్యాచ్ కాదు కదా బంతిని ఆపడానికి కూడా నానా కష్టాలు పడ్డాడు. చివరికి ఎలాగోలా బంతిని పట్టుకొని బౌలర్ వైపుకు విసిరేందుకు ప్రయత్నించాడు. కానీ అలా విసురుతున్న క్రమంలో అతని షూ తగిలి మళ్ళీ బంతి ఫోర్ బౌండరీ దాటేసింది.