వెరసి ఇక సన్రైజర్స్ ఆటతీరుతో అటు అభిమానులు అందరూ కూడా రోజురోజుకు నిరాశలో మునిగిపోతున్నారు. అయితే ఈ ఏడాది ఐడెం మార్కరమ్ ను కొత్త కెప్టెన్ గా నియమిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో సన్రైజర్స్ ఫ్రాంచైజీ లో ఉన్న జట్టుకి ఐరన్ మార్కరమ్ కెప్టెన్గా మొదటి ప్రయత్నంలోనే ఐపీఎల్ టైటిల్ అందించాడు. దీంతో అతనిపై నమ్మకం పెట్టుకొని కెప్టెన్సీ అప్పగించింది. కానీ సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ ఉన్న నేపథ్యంలో అతను కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో ఇక జట్టులో ఎవరూ లేనట్లు అటు భువనేశ్వర్ కుమార్కు కెప్టెన్సీ అప్పగించింది జట్టు యాజమాన్యం. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కెప్టెన్సీ చేపట్టిన అనుభవం లేదు అని చెప్పాలి. ఇక అతని అనుభవ లేమీ జట్టు ఘోర పరాభవానికి కారణమైంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. సొంత ప్రేక్షకుల మధ్య కూడా గెలవలేకపోయింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ 131 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బౌలర్ల దెబ్బకు సన్రైజర్స్ బ్యాట్స్మెన్లందరూ కూడా కుప్పకూలారు. దీంతో ఎవరు దొరకనట్టు పోయిపోయి భువనేశ్వర్ కి కెప్టెన్సీ అప్పగించారు అంటూ కొంతమంది ఇక అతన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి