
అంతేకాదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణమే అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా మహేంద్రసింగ్ ధోనిని మరింత దగ్గర చేసింది అని చెప్పాలి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాత్రమే కాదు ఇక మైదానం బయట కూడా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు మహేంద్ర సింగ్ ధోని. అటు సమాచారం ఆటగాళ్లను ఆటపాటించడం లాంటివి చేస్తూ ఉంటాడు. అయితే ధోని ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు అన్నది మాత్రం మరోసారి నిరూపితం అయింది అని చెప్పాలి. ఐపిఎల్ లో భాగంగా చెన్నై, లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ధోని సేన విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.
ఇక మ్యాచ్ చివర్లో మహేంద్రసింగ్ ధోని కొట్టిన రెండు సిక్సర్లు కూడా మ్యాచ్ మొత్తానికి కూడా హైలెట్ గా మారిపోయాయి. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఇక ఈ మ్యాచ్ చూడడానికి వచ్చిన లక్నో ఆటగాడు కృష్ణప్ప గౌతం భార్య కూతురుతో కలిసి ధోనీని కలిశాడు. ఈ సందర్భంగా కృష్ణప్ప గౌతమ్ కూతురిని ధోని తన స్టయిల్ హై ఫై ఇచ్చాడు. కాసేపు తను కూడా చిన్నపిల్లాడిలా మారిపోయి పాపతో సందడి చేశాడు. దీంతో లక్నో ప్లేయర్ కృష్ణ గౌతమ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్ గా మారిపోయాయి.