శనివారం రోజు ఐపీఎల్ 16 వ సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణ పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 204 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్ రైజర్స్ ముందు ఉంచగా ఏ క్రమంలో సైతం ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా సన్ రైజర్స్  ఆట తీరు కనిపించలేదు. 20 ఓవర్ల పాటు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం ఎనిమిది వికెట్లు కోల్పోయి 132 పరుగులు మాత్రమే చేసింది, దీంతో 72 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది, రాజస్థాన్ బౌలర్ల లో నాలుగు వికెట్లతో సన్ రైజర్స్ పతనానికి కారణమయ్యాడు ఛాహాల్. .

ఇక రాజస్థాన్ బుధవారం రోజు పంజాబ్ కింగ్స్ తో మరో మ్యాచ్ ఆడింది. అయితే పంజాబ్ కి రాజస్థాన్ వెళ్తున్నా సమయంలో అక్కడి లోకల్ టీవీ జర్నలిస్ట్ రాజస్థాన్ బౌలర్ ఛాహాల్ ని ఒక ఇంటర్వ్యూ చేశాడు. ఇది ఆసాంతం చాలా ఫన్నీగా సాగింది. సన్ రైజర్స్  మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసిన నువ్వు ఉమ్రాన్ భాయ్ సరిగ్గా డిఫెన్స్ చేయకపోతే నీకు ఐదో వికెట్ కూడా దక్కేది కదా అంటూ జర్నలిస్ట్ ఫన్నీ ప్రశ్న అడుగుతూ ఇప్పుడు అతనికి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగాడు. దానికి ఛాహాల్ సైతం తనదైన రీతిలో ఎంతో ఫన్నీగా సమాధానం చెప్పాడు.  ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

ఛాహాల్ చెప్పిన  సమాధానం ఇలా ఉంది.. నేను చెప్పడానికి ఏముంది.. మొదట ఉమ్రాన్ ను కలిసినప్పుడు నా బౌలింగ్ లో సిక్సులు కొడతానని మాట ఇచ్చాడు. కానీ అతడు నాకిచ్చిన మాటను తప్పాడు. నాకు ఎంతో బాధగా ఉంది అంటూ చౌహాన్ సెటైరికల్ గా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: