చివరికి ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే కొన్ని కొన్ని సార్లు ఢిల్లీ జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ ఇక ప్రత్యర్థులను కట్టడి చేయడంలో మాత్రం విఫలమవుతుంది అని చెప్పాలి. ఎంత ప్రయత్నించినా అటు ఓటమి మాత్రం తప్పడం లేదు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ అటు ఢిల్లీకి పీడకలలా మిగిలిపోతుంది అని ఆ జట్టు అభిమానులు అందరూ కూడా అంటున్నారు. ఇకపోతే ఇటీవలే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ కోపంతో ఊగిపోయాడు అని చెప్పాలి. సాధారణంగా అయితే వార్నర్ ఎప్పుడు ఎంతో కూల్ గా కనిపిస్తూ ఉంటాడు.
కానీ ఇటీవలే ముంబై తో జరిగిన మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సహచర ఆటగాడి పై కోపంతో ఊగిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ 12 ఓవర్ ను గ్రీన్ వేయగా.. వార్నర్ మీడ్ ఆఫ్ దిశగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అదే మిస్ టైం కావడంతో మీడ్ ఆఫ్ లో ఉన్న చావ్లా చేతికి వెళ్ళింది. కానీ చావ్లా ఈజీ క్యాచ్ ను జార విరిచాడు. ఈ క్రమంలోనే వార్నర్ సింగిల్ కోసం ప్రయత్నిస్తుండగా.. నాన్ స్ట్రైక్ లో ఉన్న లలిత్ యాదవ్ వార్నర్ను గమనించకుండా చావ్లా వైపు చూస్తూ ఉండిపోయాడు. దీంతో వార్నర్ సీరియస్ అయ్యాడు. అతనిపై గట్టిగా అరుస్తూ రన్ కు వెళ్ళు అంటు సైగలు చేసాడు. ఇక ఆ సమయంలో ఒకవేళ చావ్లా వికెట్ కీపర్ వైపు త్రో చేసి ఉంటే వార్నర్ రన్ అవుట్ అయ్యేవాడు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి