బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య ఉన్న వివాదం గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించిన సమయం లో ఈ వివాదం రాజుకుంది అన్న విషయం తెలిసిందే. తనకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండానే సారధ్య బాధ్యతల నుంచి తప్పించారు అంటూ విరాట్ కోహ్లీ చెప్పడం సంచలనంగా మారి పోయింది. తాము ముందుగా విరాట్ కోహ్లీకి సమాచారం అందించాకే కెప్టెన్సీ నుంచి తప్పించాము అంటూ సౌరబ్ గంగూలీ చెప్పాడు.



 ఇక ఇలా వీరిద్దరూ కెప్టెన్సీ మార్పుపై ఇచ్చిన స్టేట్మెంట్లు పరస్పరం విరుద్ధం గా ఉండడం తో అటు భారత క్రికెట్ లో ఏం జరుగుతుందో కూడా అర్థం కాక కన్ఫ్యూషన్ లో పడి పోయారు అభిమానులు. ఇక అప్పటినుంచి అటు సౌరబ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వివాదం కొనసాగుతూనే వస్తుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇటీవలే సద్దుమణిగింది అనుకున్న ఈ వివాదం మరోసారి తారా స్థాయికి చేరుకుంది అన్నది తెలుస్తుంది. మొన్నటికి మొన్న ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో మ్యాచ్ అనంతరం సౌరబ్ గంగూలికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి విరాట్ కోహ్లీ ఇష్టపడలేదు.


 అంతేకాకుండా ఇక సౌరబ్ గంగూలీ ముందు నుంచి వెళ్తున్న సమయంలో విరాట్ కోహ్లీ కాలు మీద కాలు వేసుకొని పట్టించుకోనట్లుగానే కూర్చున్నాడు. అయితే ఇక ఇటీవల ఏకంగా విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో సౌరబ్ గంగూలీని అన్ ఫాలో చేయడం వీరి మధ్య వివాదానికి మరింత బలం చేకూర్చింది అని చెప్పాలి. అయితే ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుంది అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం భారత క్రికెట్లో ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు దీని గురించి చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl