రాహుల్ మ్యాచ్లలో పరుగులు చేస్తున్నాడు కానీ.. ఇక ఇలా పరుగులు చేయడం కోసం ఎక్కువ బంతులను తినేస్తూ ఉన్నాడు. దీంతో అతి తక్కువ స్ట్రైక్ రేట్ తో వన్డే ఫార్మాట్ తరహాలో బ్యాటింగ్ చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతని స్లో బ్యాటింగ్ చివరికి జట్టుకు ప్రమాదంగా మారిపోయింది అంటూ ఎంతో మంది విమర్శలు కూడా చేశారు. అయితే మొన్నటి వరకు స్లో బ్యాటింగ్ తో చిరాకు తెప్పించిన కేఎల్ రాహుల్ ఇక ఇటీవల గుజరాత్తో జరిగిన మ్యాచ్లో మాత్రం మరోసారి మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు.
61 బంతుల్లో 68 పరుగులు చేశాడు అని చెప్పాలి. అయితే ఇక ఈ మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడటం ద్వారా ఒక అరుదైన ఘనతను కూడా సాధించాడు కేఎల్ రాహుల్. కోహ్లీ రికార్డును బద్దలు కొట్టేశాడు. టి20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 7000 పరుగులు పూర్తి చేసుకున్న భారత ఆటగాడిగా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. రాహుల్ కేవలం 197 ఇన్నింగ్స్ లోనే 7వేల పరుగుల మార్క్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు వరకు కోహ్లీ 212 ఇన్నింగ్స్ లో 7 వేల పరుగులు చేసి అత్యంత వేగంగా 7 వేల పరుగులు చేసిన ప్లేయర్ గా ఉండగా.. రాహుల్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి