సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మరోసారి హోమ్ గ్రౌండ్ వేదికగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది అని చెప్పాలి. మొదటి రెండు మ్యాచ్లలో ఓడిపోయిన హైదరాబాద్ జట్టు ఆ తర్వాత రెండు మ్యాచ్లలో విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయం సాధించి.. హ్యాట్రిక్ కొడుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఓడిపోయింది. ఈ ఆ తర్వాత మరో ఓటమిని కూడా చవిచూసింది అని చెప్పాలి. ఇలా 6 మ్యాచుల్లో రెండు విజయాలు 4 ఓటములతో పాయింట్లు పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతూ ఉంది అని చెప్పాలి.
అదే సమయంలో ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో మొదటి విజయాన్ని నమోదు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇక ఇప్పుడు వరుసగా విజయాలు సాధించాలని అనుకుంటుంది. దీంతో ఇక నేడు హైదరాబాద్ తో జరిగే మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది అని చెప్పాలి. కాగా పాయింట్లు పట్టికలో కేవలం ఒకే ఒక విజయం సాధించిన ఢిల్లీ జట్టు చివరి స్థానంలో కొనసాగుతూ ఉంది. ఇలా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న ఈ రెండు జట్లు తలబడుతున్న నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి