
ఐపీఎల్ ప్రారంభం సమయంలో వరుస విజయాలతో సతమతమై విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది ఈ ఛాంపియన్ టీం. ఈ క్రమంలోనే ఇక అదృష్టం కూడా కలిసి రావడంతో అటు రన్ రేట్ నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా అటు ప్లే ఆఫ్ లో అవకాశాన్ని దక్కించుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల లక్నో జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో మరోసారి విజయాన్ని సాధించి అదరగొట్టింది ముంబై ఇండియన్స్. ముంబై జోరు చూస్తే టైటిల్ గెలవడం ఖాయం అనే భావన అభిమానుల్లో కలుగుతుంది అని చెప్పాలి. ఇక ఇటీవల ప్లే ఆఫ్ లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పింది.
ఒక ఇన్నింగ్స్ లో ఒక్క బ్యాట్స్మెన్ కూడా అర్థ సెంచరీ చేయకుండా అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది అని చెప్పాలి. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అయితే ముంబై జట్టులో ఒక్క బ్యాట్స్మెన్ కూడా 50 చేయకపోవడం గమనార్హం. అయితే గతంలో ఈ రికార్డు సన్రైజర్స్ పేరు మీద ఉంది. 2018 లో ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై పై సన్రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇలా సన్రైజర్స్ ఇన్నింగ్స్ లో ఒక్క అర్థ సెంచరీ కూడా లేదు. అయితే ప్లే ఆఫ్ లాంటి కీలకమైన మ్యాచ్లలో ఇలా జరగడం చాలా అరుదు అని చెప్పాలి.