
ఇలాంటి ఘటనల గురించి తెలిసినప్పుడు నిజంగా వాళ్ళు అదృష్టవంతులు అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక బస్సు డ్రైవర్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. అతనికి అనుకోని రీతిలో అదృష్టం వరించింది చికెన్ కబాబ్స్ కొనడానికి వెళ్లిన సదరు వ్యక్తి చివరికి 10 కోట్ల రూపాయలకు యజమానిగా మారిపోయాడు. అదేంటి చికెన్ కబాబ్ కొనడానికి వెళ్తే 10 కోట్లు ఎలా వస్తాయి అని అనుకుంటున్నారు కదా.. ఇది కేవలం జోక్ మాత్రమే అని అనిపిస్తుంది కదా.. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే..
ఎందుకంటే నిజంగానే ఇక్కడ ఇది జరిగింది.. యూకే లోని లీసిస్టర్ నగరంలో 51 ఏళ్ల బస్సు డ్రైవర్ ప్రయాణ సమయంలో కబాబ్ దుకాణం వద్దకు వచ్చాడు. ఇక బస్సును ఆపి కబాబ్ను ఆర్డర్ చేశాడు. అయితే కబాబ్ చేసేందుకు కాస్త సమయం పడుతుందని అక్కడ హోటల్ సిబ్బంది చెప్పడంతో సరదా కోసం ఇక సమీపంలోనే లాటరీ షాప్ లో టికెట్ కొన్నాడు. సరదా కోసం అతను చేసిన పని అదృష్ట లక్ష్మిలా కలిసి వచ్చింది. ఏకంగా 10 కోట్ల 25 లక్షల రూపాయల విలువైన లాటరీ తగిలింది. అతని పేరు స్టివ్ గుడ్ విన్. అయితే తాను కేవలం టైంపాస్ కోసం లాటరీ కొన్నానని.. కానీ ఇంత పెద్ద మొత్తం గెలుస్తానని అనుకోలేదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అతను.