తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు గత కొన్నెళ్ల నుంచి టీమిండియా కు పూర్తిగా దూరమైపోయాడు అని చెప్పాలి. అయితే టాలెంట్ ఉన్న అతన్ని సెలక్టర్లు పక్కన పెట్టారు  అంటూ ఇప్పటికీ భారత క్రికెట్ లో ఎంతమంది చర్చించుకుంటూ ఉంటారు. అయితే అటు ఇండియన్ జట్టుకి దూరమైనప్పటికీ ఐపీఎల్లో మాత్రం వివిధ ఫ్రాంచైజీల  తరపున తనదైన ఆట తీరుతో ఎప్పుడు అంబటి రాయుడు మంచి ప్రదర్శన చేస్తూనే వస్తున్నాడు అని చెప్పాలి. ఇక ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే అలాంటి  రాయుడు ఇక ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల జరిగిన ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ తనకు చివరి మ్యాచ్ అంటూ ప్రకటించాడు అంబటి నాయుడు. అయితే ఇక ఈ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ జట్టుతో తలపడగా చివరికి విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. ఐదవ సారి టైటిల్ గెలుచుకుంది అని చెప్పాలి. దీంతో చెన్నై తరపున ఆడతున్న అంబటి రాయుడుకు ఇక చివరి మ్యాచ్ లో ఘన వీడ్కోలు లభించింది అనడంలో సందేహం లేదు.


 అయితే అంబటి రాయుడు అటు ఐపీఎల్ నుంచి తప్పుకున్నప్పటికీ దేశవాళీ క్రికెట్లో మాత్రం కొనసాగుతాడు అని అభిమానులు అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఇక అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి   కూడా అంబటి రాయుడు తప్పుకుంటున్నాడు అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని అంబటి రాయుడు స్వయంగా ప్రకటించాడు. దేశం తరఫున ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు రాయుడు. ఈ అవకాశం కల్పించిన బీసీసీఐ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్ లో ఆడేందుకు తన ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకి కూడా కృతజ్ఞతలు అంటూ తెలిపాడు. అయితే మహేంద్రసింగ్ ధోని లాంటి ప్లేయర్ తో ఆడటం ఒక గొప్ప అవకాశం గా భావిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు రాయుడు

మరింత సమాచారం తెలుసుకోండి: