మరికొన్ని రోజుల్లో టీమ్ ఇండియా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. ఈ కీలకమైన ఫైనల్ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది హాట్ టాపిక్ గా మరింది. అయితే గత ఏడాది  డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా ఫైనల్ వరకు వెళ్లి చివరి అడుగులో బోల్తా పడింది.. దీంతో కేవలం రన్నరప్ తోనే  మాత్రమే సరిపెట్టుకుంది. అయితే మరోవైపు ఆస్ట్రేలియా జట్టు మొదటిసారి డబ్ల్యూటీసి ఫైనల్ అడుగుపెట్టింది అని చెప్పాలి. దీంతో ఇరుజట్లు కూడా డిప్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో గెలవాలని ఎంతో పట్టుదలతోనే ఉన్నాయి అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారు అనే విషయం గురించి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో చర్చ నడుస్తుంది. ఎంతో మంది మాజీ ఆటగాళ్లు  ఇదే విషయంపై చర్చించుకుంటూ ఇక తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఒకవేళ డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో ఒక ఆస్ట్రేలియా గెలిచిన లేదంటే భారత్ గెలిచిన కూడా ప్రపంచ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రెండు జట్లు కూడా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన టీంలుగా ఉన్నాయి. ఇక ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో గెలిస్తే మూడు ఫార్మట్లలో వరల్డ్ ఛాంపియన్ ఇచ్చిన టీం గా గెలిచిన జట్టు చరిత్ర సృష్టిస్తుంది.


 ఇకపోతే డబ్ల్యూటీసి  ఫైనల్ మ్యాచ్ గురించి  టీమ్ ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరో నాలుగు రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే హాట్ ఫేవరెట్ గా ఆస్ట్రేలియా బలిలోకి దిగుతున్న.. టీమ్ ఇండియానే విజయం సాధిస్తుందని రవి శాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత ఆటగాళ్ళు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నారని.. ఇక భారత జట్టు విజయం సాధించాలంటే ఒక్క రోజు చాలు అంటూ వ్యాఖ్యానించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా జట్టును భారత్ చిత్తగా ఓడించింది అన్న విషయాన్ని గుర్తు చేశాడు రవి శాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: