ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ లో బిజీబిజీగా ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భాగంగా పటిష్టమైన ఆస్ట్రేలియా తో హోరాహోరీగా తలబడుతుంది. ఈ క్రమంలోనే సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే టెస్ట్ ఫార్మాట్లో విశ్వ విజేతగా నిలిచేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక అటు ఇంగ్లాండ్ లోని ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చలాయిస్తుంది అని అందరూ అనుకున్నారు. ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే ఓడించిన టీమిండియాకు.. ఇంగ్లాండ్ గడ్డపై ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు అని అందరూ భావించారు.


 కానీ ఊహించని రీతిలో అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా రాణించాల్సిన సమయంలో.. టీం ఇండియా మాత్రం తడబాటుకు గురవుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం ఎక్కడ ప్రభావం చూపలేక పోతుంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా తక్కువ పరుగులకే చేతులు ఎత్తేస్తూ ఉండడంతో ఇక ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన కొండంత లక్ష్యాన్ని చేదించడంలో విఫలం అవుతుంది అని చెప్పాలి. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి అటు టీమిండియా పై 296 పరుగులు ఆదిత్యంలో ఉంది ఆస్ట్రేలియా. ఇదిలా ఉంటే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న మైదానంలో ఒక ఆసక్తికర విషయం జరిగింది.



 సాధారణంగా కెమెరాల దృష్టిని ఆకర్షించేందుకు మ్యాచ్ చూడ్డానికి వచ్చిన ఎంతోమంది అభిమానులు వింతైన కొటేషన్స్ రాసి ఫ్లకార్డులను ప్రదర్శించడం చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల ఒక మహిళ అభిమాని ఏకంగా మైదానంలో ఫ్లకార్డు పట్టుకుని భారత బ్యాట్స్మెన్ గిల్ కు ప్రపోజ్ చేసేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ జరుగుతుండగా.. శుభమన్ గిల్ కు యువతి మ్యారేజ్ ప్రపోజల్ చేస్తూ ప్లకార్డు ప్రదర్శించింది. అయితే ఈ విషయాన్ని గిల్ పట్టించుకోలేదు. కానీ కెమెరాలు మాత్రం పదే పదే దాన్ని హైలైట్ చేశాయి. కాగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో సమన్వయ లోపంతో గిల్ రన్ అవుట్ ఛాన్స్ మిస్ చేశాడు. దీంతో గిల్ మ్యారేజ్ ప్రపోజల్ తో కంగారుపడ్డాడని.. అందుకే రన్ అవుట్ ఛాన్స్ మిస్ చేసాడంటు నేటిజన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc