దీంతో అందరి చూపు ఒక్కసారిగా అతని వైపుకు మళ్ళింది. 2023 ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్ లు ఆడిన రింకు 149.5 స్ట్రైక్ రేట్ తో 474 పరుగులు సాధించాడు. అయితే టీమిండియాని ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న ఫినిషేర్ పాత్రకు రింకు సింగ్ సరైన వాడు అంటూ ఎంతోమంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఐపీఎల్ లో రాణించిన రింకు కీ మరికొన్ని రోజుల్లో అటు భారత జట్టులో కూడా చోటు దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. వెస్టిండీస్ పర్యటనలో రింకు సింగ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇక యంగ్ క్రికెటర్ రింకు సింగ్ కి అటు మరో స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ సోదరి పడిపోయిందా అంటే ఇటీవలే ఆమె చేసిన కామెంట్ చూసిన తర్వాత అందరూ అవును అనే సమాధానం చెబుతున్నారు. ఇటీవల రింకు సింగ్ కండలు చూపిస్తూ సిక్స్ ప్యాక్ తో షర్ట్ లెస్ గా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ఫోటోపై గిల్ సోదరీ షానిల్ ఇచ్చిన రిప్లై హైలైట్ గా మారింది. రింకు పోస్ట్ పై స్పందిస్తూ 'ఓ హీరో' అంటూ శానిల్ కామెంట్ చేసింది. దీంతో ఇక రింకు సింగ్ కి షానిల్ పడిపోయిందని.. ఇక వీరి మధ్య మరికొన్ని రోజుల్లో ప్రేమ పుట్టడం ఖాయమంటూ ఎంతోమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి