చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ 2023 గెలిచి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు అందుకున్న ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. చెన్నైకి కూడా ఇది 5వ టైటిల్. ధోని కెప్టెన్సీలో చెన్నై 5 సార్లు ఫైనల్స్ లో గెలిచి రికార్డు సృష్టించింది. చెన్నై విజయాల్లో కెప్టెన్ ధోనీది కీలక పాత్ర. అయితే ఈ సీజన్ లో మాత్రం ధోని మోకాలి గాయంతో బాదపడ్డారంట. అయినా కూడా ఒక్క మ్యాచ్ కి కూడా దూరం కాకుండా జట్టును నడిపించాడు. ఐపిఎల్ అయిపోయాక తన మెకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం ధోని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడే ఇదే విషయంపై సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడారు. అయితే ఐపిఎల్ జరిగే సమయంలో ధోని తన సమస్య గురించి ఎవ్వరికి చెప్పలేదంట. సమస్య పెద్దదైతే చెప్పేవాడని, ఫైనల్స్ వరకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని, ఫైనల్ మ్యాచ్ తర్వాత తన మోకాలికి సర్జరీ చేయించుకున్నాడని, సర్జరీ సక్సెస్ అయ్యిందని, ధోని త్వరగా కోలుకోవాలని ఇంటర్వ్యూలో విశ్వనాథన్ తెలిపారు. అయితే తరువాత ఐపిఎల్ ధోని ఆడతారా లేదా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి