అయితే వీరేంద్ర సెహ్వాగ్ ను భారత చీఫ్ సెలెక్టర్ గా నియమిస్తారు అన్న విషయం నిజమో కాదు తెలియదు కానీ ఒకవేళ బిసిసిఐ అలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం.. భారత జట్టుకు ఎంతో మేలు కలుగుతుంది అంటూ ఎంతో మంది క్రికెట్ ఫ్యాన్స్ అటు సోషల్ మీడియాతో కామెంట్లు చేశారు అని చెప్పాలి. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వీరేంద్ర సెహ్వాగ్ ఇక ఇటీవల తనపై వచ్చిన ఒక వార్త గురించి క్లారిటీ ఇచ్చాడు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవి కోసం తనను సంప్రదించినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ క్లారిటీ ఇచ్చాడు.
ఇప్పుడు వరకు ఎవరు కూడా భారత చీఫ్ సెలెక్టర్ పదవి కోసం తనను సంప్రదించలేదు అంటూ స్పష్టం చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. కాగా ప్రస్తుతం ఈ మాజీ క్రికెటర్ వివిధ స్పోర్ట్స్ ఛానళ్లలో అనలిస్టుగా పనిచేస్తున్నాడు అని చెప్పాలి. అయితే భారత చీఫ్ సెలెక్టరుగా నియమితులు అయ్యారు అంటూ గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ పేర్లు కూడా తెరమీదకి వచ్చాయి అని చెప్పాలి. అయితే వీరేంద్ర సెహ్వాగ్ చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు అన్న వార్త రావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కానీ అదంతా కేవలం పుకార్లు మాత్రమే అని తెలియడంతో అభిమానులు కాస్త నిరాశలో మునిగిపోయారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి