అదే సమయంలో ఐపీఎల్లో రానించి మొన్నటికి మొన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా తన ప్రదర్శనతో పర్వాలేదు అనిపించిన అజంక్య రహానేకు జట్టులో చోటు దక్కటమే కాదు మరోసారి వైస్ కెప్టెన్సీ హోదా కూడా దక్కింది. అయితే పూజారకు చోటు దక్కని నేపథ్యంలో అతని కెరియర్ ముగిసిపోయింది అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో సీనియర్లందరినీ కూడా ఒక్కొక్కరిగా పక్కన పెడుతూ కుర్రాళ్లకు ఛాన్స్ ఇస్తూ వస్తున్నారు టీమిండియా సెలెక్టర్లు. వృద్ధిమాన్ సాహ, శిఖర్ ధావన్ విషయంలో ఇలాగే వ్యవహరించారు. అయితే ఇక ఇప్పుడు పూజారను పక్కన పెట్టినట్లుగానే వెస్టిండీస్ టూర్లో ఫెయిల్ అయితే మరో ఇద్దరు టీమిండియా సీనియర్లపై కూడా వేటు పడే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది.
అయితే ఆ సీనియర్ క్రికెటర్లు ఎవరో కాదు ప్రస్తుతం జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీలు. 30ఏళ్ళు దాటిన ఇద్దరి అనుభవం టీమిండియా కు చాలా అవసరం. అయితే ఎంత అనుభవం ఉన్న టీంకు భారంగా మారితే మాత్రం వేటు పడక తప్పదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వెస్టిండీస్ టూర్ ముగిసిన నాలుగు నెలల తర్వాత డిసెంబర్లో సౌత్ ఆఫ్రికా టూర్ కి వెళ్తుంది టీమిండియ. అప్పటికే వరల్డ్ కప్ టోర్నీ కూడా ముగుస్తుంది. వరల్డ్ కప్ లో టీమిండియా గెలిస్తే ఓకే గాని ఓడితే మాత్రం జట్టుపై ఆ ప్రభావం మరింత తీవ్రంగా పడుతుంది. దీంతో ఇక ఈ వరల్డ్ కప్ ముగిసే సమయానికి జట్టులో ఎన్ని అనూహ్యమైన మార్పులు జరిగినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి