వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీం గా కొనసాగుతున్న టీమిండియా గత కొంతకాలం నుంచి మాత్రం ఐసీసీ టోర్నీలలో పెద్దగా ప్రభావం చూపలేక పోతుంది అన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో 2013లో మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన తర్వాత ఇప్పటివరకు ఐసీసీ వరల్డ్ కప్ గెలవడం అనేది టీమిండియాకు కలగానే మారిపోయింది. అయితే గత కొంతకాలం నుంచి వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసి ఫైనల్ కు చేరుకున్న టీమిండియా ఇక ఒట్టి చేతులతోనే ఇంటి బాట పట్టింది. ఇక పరిమిత ఓవర్లో ఫార్మాట్లో జరిగే వరల్డ్ కప్ లో అయితే ఎక్కడ ప్రభావం చూపించలేక పోతుంది అని చెప్పాలి.


 మరీ ముఖ్యంగా సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకు ఎంతో అద్భుతంగా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్న టీమిండియా.. కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో మాత్రం ఒత్తిడికి చేతులెత్తేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. దీంతో టీమిండియా కు చొకర్స్ అనే ట్యాగ్ని తగిలిస్తున్నారు ఎంతో మంది నేటిజన్స్. ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేసే టీంలను ఉద్దేశించి క్రికెట్ పరిభాషలో చోకర్స్ అని అభివర్ణిస్తారు. దీంతో ఇప్పుడు ఈ ట్యాగ్ ను అటు టీమిండియా కు తగిలిస్తూ ఉన్నారు. ఇక ఇదే విషయంపై అటు టీమిండియా మాజీ కోచ్  రవి శాస్త్రి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అని చెప్పాలి.


 భారత జట్టుకు ఇలాంటి ట్యాగ్ తగిలించడం సరికాదని పేర్కొన్నాడు రవి శాస్త్రి. టీమిండియా బలమైన జట్టని ఇటీవల ఐసీసీ టోర్నమెంట్ లో సెమీఫైనల్స్, ఫైనల్స్ వరకు చేరుకుంది అంటూ గుర్తు చేశాడు. మూడు ప్రపంచ కప్ లు గెలిచే అవకాశం ఉన్న రెండు జట్లు భారత్, ఆస్ట్రేలియా మాత్రమే. పెద్ద టోర్ని లలో మనం బోల్తా పడుతున్నామని కాదు.. మనం సెమీఫైనల్స్ వరకు చేరుకున్నాం.. ఫైనల్స్ వరకు వెళ్తున్నాం అది కూడా గుర్తుపెట్టుకోవాలి అంటూ రవి శాస్త్రి ఇటీవల తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: