సెలబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఒకప్పుడు సినీ సెలెబ్రిటీల దగ్గర నుంచి క్రీడాకారుల వరకు ప్రతి ఒక్కరు కూడా తమ పర్సనల్ లైఫ్ ని ఎంతో రహస్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడేవారు. పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఏ విషయం కూడా అభిమానులతో పంచుకునేవారు కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటుగానే సెలబ్రిటీల తీరు మారింది. దీంతో ఎంతోమంది ప్రొఫెషనల్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.


 ఈ క్రమంలోనే ఇలా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఏదైనా తెర మీదికి వచ్చాయంటే చాలు.. అవి కాస్త హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ వెటరన్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన కామెంట్స్ కూడా ఇలాగే ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంగ్లాండు ఫేసర్ క్రిస్ వోక్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు స్టువర్టు బ్రాడ్. అతను ఒక అసాధారణమైన ఆటగాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. క్రిస్ వోక్స్ అంటే తన భార్య మౌలికి పిచ్చని.. అతనంటే పడి చచ్చిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అతని తర్వాతే నేను అంటూ ఎన్నో సార్లు చెప్పింది అంటూ గుర్తు చేసుకున్నాడు.


 నేను నా సతీమణిని ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అంటే.. క్రిస్ వొక్స్ పేరు చెప్పింది.  వెంటనే నేను మరి అని అడిగితే ఆమె క్రిస్ వొక్స్ తర్వాతే నువ్వు అంటూ బదులిచ్చింది. ఇది అతనికి దక్కిన అతిపెద్ద ప్రశంస అంటూ స్టువర్టు బ్రాడ్ చెప్పుకొచ్చాడు   ఇంగ్లాండ్ రెండు ప్రపంచ కప్  లు గెలవడంలో క్రిష్ వోక్స్ కీలక పాత్ర వహించాడు. ముఖ్యంగా హెడింగ్లి వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుని సిరీస్ అవకాశాలను అవకాశాలను సజీవంగా ఉండేలా చేశాడు అంటూ స్టువర్టు బ్రాడ్ చెప్పుకొచ్చాడు. మార్క్ వుడ్ ఇంగ్లాండ్ తుది జట్టులో ఉంటే మా బలం మరింత పెరుగుతుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: