భారత జట్టులో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించుకున్న సమయంలో అటు భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. కానీ ఆ తర్వాత కాలంలో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడడంతో అతనిపై వేటు వేశారు సెలెక్టర్లు. అయితే అతనికి అనూహ్యంగా అటు ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడే అవకాశం దొరికింది. కాగా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా పేరు ఉన్న అజింక్య రహనే ఇక దూకుడు అయిన ఆటతీరుతో అందరిని ఆశ్చర్యపరిచాడు. సెలక్టర్లు చివరికి అతని ఆటను చూసి డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో ఛాన్స్ కల్పించారు.
కాగా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకున్నాడు. ఏకంగా ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో 89, 46 పరుగులతో జట్టుకు మంచి స్కోర్ అందించడంలో కీలకపాత్ర వహించాడు. ఇక ఇప్పుడు అటు వెస్టిండీస్ పర్యటనకు కూడా సెలెక్ట్ అయ్యాడు అని చెప్పాలి. అయితే మొదటి మ్యాచ్ లో నిరాశ పరిచినప్పటికీ అతనిపై అటు టీమిండియా భారీగానే నమ్మకం పెట్టుకుంది. అతని బ్యాటింగ్ గురించి భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎప్పటికప్పుడు టెక్నిక్ ను మెరుగుపరుచుకుంటే మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చు. రహానే అదే పని చేస్తున్నాడు. పునరాగమనంలో భిన్నంగా కనిపిస్తున్నాడు. నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా కండిషన్లలో ఇలాంటి ఆటగాళ్లు చాలా అవసరం అంటూ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి