ఐపీఎల్ మొదలైన నాటి నుంచి కూడా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు మహేంద్రసింగ్ ధోని. తన సారధ్యంలో జట్టును ఎంతో విజయవతంగా ముందుకు నడిపించాడు. ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా కూడా నిలిపాడు. దీంతో ప్రస్తుతం ఐపీఎల్ హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఒక ఛాంపియన్ టీం అన్నట్లుగా ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. అయితే ఇలా జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించిన ధోనీకి.. రిటైర్మెంట్ వయసు వచ్చేసింది. దీంతో ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ చేపట్టబోయేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.


 అయితే గత ఏడాది ఐపీఎల్ సీజన్ సమయంలో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని తన వారసుడిగా పేరు ఉన్న రవీంద్ర జడేజాకు సారధ్య బాధ్యతలను అప్పగించాడు. కానీ జడేజా సారథిగా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించలేక ఒత్తిడిలో మునిగిపోయాడు. ఇక అతను వ్యక్తిగత ప్రదర్శన పై కూడా ఈ ఒత్తిడి ప్రభావం చూపింది. దీంతో వెంటనే కెప్టెన్సీ వదులుకొని మరోసారి ధోని చేతుల్లోని సారధ్య బాధ్యతలను పెట్టాడు. అయితే ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో  బెన్ స్టోక్స్ కి భారీ ధర పెట్టడంతో అతనికి కెప్టెన్సీ అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ అదినిజం కాలేదు.


 దీంతో ధోని వారసుడిగా చెన్నై కెప్టెన్గా ఎవరు మారుతారు అనే విషయంపై చర్చ జరుగుతూ ఉండగా.. ఆ జట్టు మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు. రవీంద్ర జడేజాకు కెప్టెన్గా అవకాశం వచ్చిన విఫలమయ్యాడు. అయితే అతనికి మరో అవకాశం లేదు అన్నది కచ్చితంగా చెప్పగలను. బెంజ్ స్టోక్స్ ని నియమించాలనుకున్న.. ఐపిఎల్ సీజన్లో పేలవ ఆట తీరు అతని అవకాశాలను దెబ్బ కొట్టింది.  అయితే సీఎస్కే తదుపరి కెప్టెన్ ఎవరో కాలమే నిర్ణయిస్తుంది అంటూ సమాధానం దాటవేయాలనుకున్న రాయుడు.. ఇక కాబోయే కెప్టెన్ రుతురాజ్ అన్న  విషయాన్ని మాత్రం దాచలేకపోయాడు. ధోనిలా ఋతురాజ్  చాలా ప్రశాంతంగా ఉంటాడు. అతనిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఎంఎస్ ధోని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సహకారంతో అతను ఎక్కువ కాలం చెన్నై జట్టుకు  సేవలను అందించగలడు అంటూ.. అతనే ఫ్యూచర్ కెప్టెన్ అని చెప్పకనే చెప్పాడు అంబటి రాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Csk