సాధారణంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి అటు టెస్ట్ ఫార్మాట్ కి ఎంతో తేడా ఉంటుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అయితే క్రీజు లోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా సిక్సర్లు ఫోర్ లతో చెలరేగాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ బంతులు ఆడి తక్కువ పరుగులు చేస్తే విమర్శలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ టెస్ట్ ఫార్మాట్లో ఎన్ని పరుగులు చేసామన్నది కాదు ఎంతసేపు క్రీజులో పాతుకుపోయాము అన్నది చాలా ముఖ్యం అని చెప్పాలి. ఎక్కువ బంతులు ఆడి తక్కువ పరుగులు చేసిన పర్వాలేదు కానీ వికెట్ను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.


 ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మట్లో ఆడటం ఎంతో సులభం అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ పరిమిత ఓవర్ల ఫార్మాట్ తో పోల్చి చూస్తే టెస్ట్ ఫార్మాట్ ఎంతో భిన్నమైనది. ఎందుకంటే బౌలర్లు వేసే వైవిధ్యమైన బంతులను డిఫెన్డ్ చేస్తూ వికెట్ను కాపాడుకుంటూ ఆచితూచి పరుగులు చేయాల్సి ఉంటుంది. దూకుడుగా ఆడాలని ప్రయత్నిస్తే చివరికి వికెట్ చేజారే అవకాశం కూడా ఉంటుంది.  టెస్ట్ ఫార్మాట్ ని ప్రతీ ప్లేయర్ కూడా ఎంతో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటాడు. ఇక ఈ ఫార్మాట్లోనేను రికార్డులు కొలగొట్టాలి అని అనుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. కాగా ఇటీవలరోహిత్ శర్మ కూడా ఇలాంటి ఒక అరుదైన రికార్డు సృష్టించాడు.


 ప్రస్తుతం వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భాగంగా భారత జట్టు కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్లో ఇలాంటి ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక రెండంకెల స్కోరు సాధించిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. 2021- 23 మధ్య రోహిత్ వరుసగా 30 ఇన్నింగ్స్ లలో రెండు అంకెల స్కోర్లు చేశాడు. ఈ లిస్టులో 29 ఇన్నింగ్స్ లతో జయవర్ధనే రెండో స్థానంలో ఉన్నాడు. ఇక వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్ లో రోహిత్ 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: