మహేంద్ర సింగ్ ధోని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీం ఇండియా కెప్టెన్ గా ఎన్నో విజయాల్ని అందించడమే కాకుండా 28 ఏళ్ళ ప్రతి భారతీయుడి కలం నిజం చేసాడు ధోని. ఐసిసి ట్రోఫీస్ అన్ని గెలిచి క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసాడు. టెస్ట్, వన్ డే, t20 లో ఇండియాని ముందుండి నడిపించాడు. ధోని వికెట్ల వెనుక ఉంటె క్రీజ్ దాటి వెళ్లాలంటే బ్యాట్స్ మెన్ భయపడేలా చేసాడు. ఇప్పటికి ధోని చేసిన స్టంపింగ్స్ చూస్తే అంటారు షాక్ అవ్వాల్సిందే. అయితే ధోని కెరీర్ ఎలా మొదలైందో అందరికి తెలిసిందే. 2007 T 20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై అద్భుతమైన విజయాన్ని అందించి కప్ ని అందించిన ధోని 2011 వన్ డే వరల్డ్ కప్ లో కెప్టెన్ గానే కాకుండా తనని తను ప్రమోట్ చేసుకొని వచ్చి అద్భుతమైన బ్యాటింగ్ తో వన్ డే వరల్డ్ కప్ అందించాడు. టెస్టుల్లో కూడా ఇండియాని ఫస్ట్ ప్లేస్ లో పెట్టాడు. ఇక ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న ధోని 5 సార్లు ఫైనల్స్ గెలిపించాడు. ధోని కొన్నేళ్ల క్రితం క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అయితే ఐపిఎల్ లో మాత్రం ఆడుతున్నాడు. ఐపిఎల్ 2023 లో కూడా చెన్నైని విజేతగా నిలబెట్టాడు. అంతేకాదు ధోని ఇప్పుడు సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. ధోని ఎంటర్ టైన్ మెంట్ ని ప్రారంబించాడు. ఈ సంస్థలో రూపొందిన తొలి చిత్రం ‘లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌’ (LGM). జులై 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతోంది. ధోని క్రికెట్ గ్రౌండ్ లోనే కాదు ఈసారి స్క్రీన్ పై కూడా కనిపించనున్నారనే వార్త వైరల్ అవుతుంది. ధోని ఈ సినిమాలో ఒక అతిధి పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తుంది. ఈ సినిమాకి ధోని నిర్మాత కావడంతో ఒక రోల్ లో కనిపించనున్నారు అనే ప్రచారం జోరుగా జరుగుతువుంది. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన లేదు. ధోని ఈ సినిమాలో కనిపించాడా..లేదా అనేది సినిమా విడుదలైతేనే తెలుస్తుంది. ధోనీ ప్రధాన పాత్రలో ‘అథర్వ ది ఆరిజిన్‌’ అనే వెబ్‌సిరీస్‌ ప్రకటించారు. సైంటిఫిక్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో సాగే నవల ‘అథర్వ ది ఆరిజిన్‌’ ఆధారంగా దాన్ని గ్రాఫిక్స్‌ రూపంలో తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: