మూడు ఫార్మాట్ లలో కనిపించని భువి మళ్ళీ టీంలోకి వస్తాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్‌లో వరుసగా రెండు సీజన్లలో పర్పుల్ క్యాప్ గెలిచిన భువి ఐపిఎల్ లో కూడా రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు భువనేశ్వర్ 21 టెస్టులు, 121 వన్డేలు, 77 టీ20 మ్యాచులు ఆడాడు. అంతేకాదు బౌలర్ గానే కాదు బ్యాటింగ్ లో కూడా భువి అదరగొడతాడు. ముఖ్యంగా డెత్ బౌలింగ్ వేయడంలో భువి స్పెషలిస్ట్. చివరి ఓవర్ లలో యార్కర్ బంతులు వేస్తూ బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెడుతుంటాడు. టీం ఇండియా విజయాల్లో భువి కీలక పాత్ర పోషించాడు. టీ20ల్లో అత్యంత కీలకమైన 19వ ఓవర్ వేసి, 9-10 పరుగులను కూడా కట్టడి చేసిన భువి అద్భుతమైన విజయాలను అందించాడు. అయితే భువి రీ ఎంట్రీ ఇచ్చాక భువి బౌలింగ్ లో మార్పులు వచ్చాయి. వికెట్ లు తీయడం లేదు, పరుగులు కూడా ఎక్కువ ఇచ్చేయడంతో భువి టీం ఇండియాకు దూరం అయ్యాడు.
ఇప్పుడు ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కి జట్టును త్వరలోనే ప్రకటిస్తారు. మరి ఈ సిరీస్ లో అయినా భువికి ఛాన్స్ వస్తుందో, లేదో చూడాలి. ఐపిఎల్ లో అంతగా రాణించకపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. భువితో పాటు మోహిత్ శర్మ కెరీర్ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే తాజా ఐపిఎల్ మోహిత్ పర్వాలేదనిపించాడు. ఇక వీరికి ఈ సిరీస్ లో కూడా అవకాశం రాకపోతే మళ్ళీ వీళ్ళని ఐపిఎల్ లోనే చూడాల్సి వస్తుందేమో. ఈ ఇద్దరికీ ఈ సిరీస్ చాలా ముఖ్యం. ఒకవేళ ఇప్పుడు జట్టులో స్థానం కోల్పోతే మళ్ళీ టీం ఇండియాలోకి రావడం అనుమానమే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి