అయితే రెండో వన్డే మ్యాచ్లో ఓడిపోయిన టీమ్ ఇండియా పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. కాగా ఇలాంటి విమర్శల మధ్య ఇక ఇప్పుడు మూడో వన్డే మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది టీం ఇండియా. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది అని చెప్పాలి. ఇక మరోవైపు అటు వెస్టిండీస్ ఇప్పటికే టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. దీంతో ఇక నేడు జరగబోయే మూడో వన్డే మ్యాచ్లో కలిసి సీరిస్ ను కైవసం చేసుకుని పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది. అయితే రెండో వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇలాంటి కీలకమైన ప్లేయర్లకు విశ్రాంతి ప్రకటించింది టీమిండియా యాజమాన్యం. దీంతో యువ ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోయారు.
అయితే ఇప్పుడు మూడో వన్డే మ్యాచ్లో ఎవరితో టీమ్ ఇండియా బరిలోకి దిగపోతుంది అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే రెండో వన్డే మ్యాచ్లో అటు సంజూ, సూర్య కుమార్ యాదవ్ లను మళ్లీ కొనసాగించే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఎవరి పైన అయినా వేటు వేస్తుందా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. మూడో వన్డే మ్యాచ్లో కూడా జట్టులో ఎలాంటి మార్పు చేయమని.. మరోసారి యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేయబోతున్నాము అంటూ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు. దీంతో మరోసారి మూడో వన్డే మ్యాచ్లో కూడా టీమ్ ఇండియా కాస్త రిస్క్ చేసి యంగ్ ప్లేయర్స్ తోనే బరిలోకి దిగిపోతుంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి