టీం ఇండియా యంగ్ ప్లేయర్ తిలక్‌ వర్మ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే ఎంతగానో సత్తా చాటాడు. ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తిలక్‌ వర్మ  తన పెర్ఫార్మన్స్ తో అందరిని అకట్టుకున్నాడు. తన కెరీర్‌లో ఎదుర్కొన్న మొదటి మూడు బంతుల్లోనే 2 సిక్సర్లు బాదాడు.ఇక ఓవరాల్‌గా 22 బంతులు ఆడిన తిలక్ వర్మ 2 ఫోర్లు ఇంకా 3 సిక్స్‌లతో 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇంకా అదే విధంగా ఫీల్డింగ్‌లో కూడా రెండు అద్భుతమైన క్యాచ్‌లతో తిలక్ వర్మ మెరిశాడు. ఇక మొదటి మ్యాచ్‌లో సంచలన బ్యాటింగ్‌ చేసిన తిలక్ వర్మ ఇప్పుడు ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించకున్నాడు. విదేశీ గడ్డపై టీ20 అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత ఆటగాడిగా రాహుల్‌ ద్రవిడ్‌ ఇంకా మురళీ విజయ్‌తో కలిసి సంయుక్తంగా తిలక్‌ నిలిచాడు.


అంతకుముందు మురళీ విజయ్‌ 2010 వ సంవత్సరంలో తన డెబ్యూ మ్యాచ్‌లో ఆఫ్గానిస్తాన్‌పై ఏకంగా 3 సిక్స్‌లు బాదగా.. 2011 వ సంవత్సరంలో రాహుల్‌ ద్రవిడ్‌ కూడా తన అరంగేట్ర మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 3 సిక్స్‌లు కొట్టాడు. ఇక ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత తిలక్‌ వర్మ ఈ అరుదైన ఫీట్‌ ని సాధించాడు. ఇంకా అదే విధంగా ఈ మ్యాచ్‌లో తిలక్‌ వర్మ మరో అరుదైన రికార్డును కూడా సాధించాడు. టీ20ల్లో అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో 30కు పైగా పరుగులు చేసిన మొదటి భారత ఆటగాడిగా వర్మ చరిత్ర సృష్టించాడు. తిలక్‌ వర్మ 177.27 స్ట్రైక్‌రేట్‌తో 39 పరుగులు చేశాడు.ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. విండీస్‌ చేతిలో కేవలం 4 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. నికోలస్ పూరన్(41) ఇంకా రోవ్‌మన్ పోవెల్(48) రాణించారు. ఇక భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: