వెస్టిండీస్‌ టీంతో జరిగిన మొదటి టీ20లో ఓటమిపాలైన టీమిండియా.. ఇప్పుడు రెండో టీ20కు రెడీ అయింది.ఆగస్టు 6 వ తేదీన గయానా వేదికగా భారత్‌-విండీస్‌ మధ్య రెండో టీ20 అనేది జరగనుంది.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా కానీ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఇండియన్ టీం భావిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా తమ తుది జట్టులో కొన్ని మార్పులు చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఫస్ట్ మ్యాచ్‌లో విఫలమైన శుబ్‌మన్‌ గిల్‌ను రెండో టీ20కు పక్కన పెట్టాలని భారత జట్టు మెనెజ్‌మెంట్‌ యోచిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. అతడి స్ధానంలో యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చి సత్తా చాటిన యశస్వీ.. టీ20ల్లో కూడా తన అరంగేట్రం కోసం అతృతగా ఎదురుచూస్తున్నాడు.


ఇంకా అదే విధంగా తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన ముఖేష్‌కుమార్‌పై వేటు పడనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ క్రమంలో అతడి స్ధానంలో మరోపేసర్‌ అవేష్ ఖాన్‌ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మరోవైపు విండీస్‌ మాత్రం ఫస్ట్ టీ20లో బరిలోకి దిగిన జట్టుతోనే ఈ మ్యాచ్‌ కూడా ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే వికెట్‌ కూడా ప్లాట్‌గా ఉంటుంది కాబట్టి బ్యాటర్లు చెలరేగడం ఖాయం. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది.అయితే వికెట్‌ పాతబడ్డకొద్ది కాస్త స్పిన్నర్లకు అనుకూలించే ఛాన్స్ ఉంది.


తుది జట్ల విషయానికి వస్తే..ఇండియా: యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్ ఆడనున్నారు.


విండీస్‌: కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్‌ కీపర్‌), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్‌), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్ ఆడనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: