బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సహా అటు దేశవాళీ టోర్నీల ద్వారా ఎంతో మంది యంగ్ క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ తెర మీదికి వస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి క్రికెటర్లు అతి తక్కువ సమయంలోనే అటు టీం ఇండియాలో ఛాన్స్ దక్కించుకుంటూ అదరగొడుతున్నారు. ఇలా భారత జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాకు ఫ్యూచర్ వీళ్లే అనే నమ్మకాన్ని టీమిండియా ఫ్యాన్స్ అందరిలో కూడా కలిగిస్తున్నారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఇలా వచ్చిన ఆటగాళ్లు కొన్నాళ్లు మాత్రమే మెరుపులు మెరూపించగలుగుతున్నారు.


 ఎక్కువ రోజులు పాటు నిలకడగా ఆడుతూ.. తమ కెరియర్ని సాఫీగా కొనసాగించలేకపోతున్నారు. వెరసి ఇక మంచి పరుగులు చేసినప్పుడు ప్రశంసలు కురిపించిన అభిమానులు ఇక పేలవ ప్రదర్శన చేస్తే మాత్రం సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారు అని చెప్పాలి. మొన్నటికి మొన్న సచిన్ వారసుడు అంటూ ఒక అరుదైన ట్యాగ్ సొంతం చేసుకున్న పృద్విషా విషయంలో ఇలాగే జరిగింది. దేశవాళి క్రికెట్లో సంచలన ఇన్నింగ్స్ లతో మెరిసిన పృద్విషా భారత జట్టులోకి వచ్చి ఇక్కడ కొన్ని రోజులపాటు మెరుపులు మెరూపించాడు. కానీ ఆ తర్వాత నిలకడలేమిటో టీమిండియాలో  స్థానమే దక్కించుకోకుండా దూరమయ్యాడు



 ఇక ఇప్పుడూ పృద్విషా సహచరుడికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అండర్ 19 ప్రపంచ కప్ లో పృద్విషా సహచరుడిగా ఉన్న శుభమన్ గిల్ ఇటీవల కాలంలో టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా మారిపోయాడు. మూడు ఫార్మట్లలో కూడా సెంచరీలు చేసి అదరగొట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్ లోను సెంచరీల మోత మోగించాడు. కానీ ఇప్పుడు టీమిండియా తరఫున మాత్రం పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. అటు టెస్ట్ సిరీస్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా గిల్.. ఇక టి20 సిరీస్ లో పేలువ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. వెస్టిండీస్తో జరిగిన మూడు టి20 మ్యాచ్ లలో 3,7,6 పరుగులు మాత్రమే చేశాడు.


 అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన టి20 మ్యాచ్ లో 126 పరుగులతో రాణించాడు. కానీ ఆ తర్వాత ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్ లలో కూడా కేవలం 92 పరుగులు మాత్రమే చేయగలిగాడు గిల్. దీనిబట్టి అతనివైఫల్యం ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల టి20 సిరీస్ లో వైఫల్యం నేపథ్యంలో గిల్ ను పక్కన పెట్టి రుతురాజ్ గైక్వాడ్.. రింకు సింగ్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలి అంటూ భారత ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: