ఈ ఏడది భారత వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ నేపథ్యంలో ప్రత్యక్షంగా మ్యాచ్ లు వీక్షించడానికి అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ సిద్ధమైపోతున్నారు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో  తమ అభిమాన జట్టుకు మద్దతు పలికేందుకు ఇక ఇప్పటికే అటు ఇండియాకు విమాన టికెట్స్  బుక్ చేసుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అటు విమాన టికెట్ ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఇక విమానా టికెట్ ధరలు ఒకే కానీ అటు వరల్డ్ కప్ మ్యాచ్ లకు సంబంధించిన టికెట్స్ ఎప్పుడు విడుదలవుతాయో అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు.


 ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి అటు క్రికెట్ ప్రపంచానికి మొత్తం గుడ్ న్యూస్ చెప్పింది ఐసీసీ. బీసీసీఐ. ఈనెల 25వ తేదీ నుంచి వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి అంటూ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అభిమానులు అందరూ కూడా టికెట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. వరల్డ్ కప్ మ్యాచ్లను ప్రత్యక్షంగా స్టేడియంలో కూర్చొని చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది క్రికెట్ ప్రేక్షకులు మాత్రం వరల్డ్ కప్ మ్యాచ్ లకు సంబంధించిన టికెట్లను ఎక్కడ కొనుగోలు చేయాలో తెలియక అయోమయంలో పడిపోతున్నారు.


 అయితే మిగతా చెట్లు ఆడే మ్యాచ్ లకి సంబంధించిన టికెట్లు ఈనెల 25 నుంచి విడుదల చేయనుండగా.. అటు భారత జట్టు ఆడే మ్యాచ్లకు సంబంధించిన టికెట్లు మాత్రం ఈ నెల 30 నుంచి మూడు వరకు విక్రయించనున్నారు. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు కూడా అప్పుడే అందుబాటులోకి వస్తాయి. సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్లు  సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి. ఇంతకీ ఈ వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించిన టికెట్లు ఎక్కడ కొనుగోలు చేయాలంటే.. https://www.cricketworldcup.com/register వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తద్వారా టికెట్లు అమ్మకాలకు సంబంధించిన డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. టికెట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి రేట్స్ ఎలా ఉన్నాయి ఇలాంటి వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇక బుక్ మై షో లేదా పేటీఎంలో టికెట్లు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc