విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెరిగిపోయిన నేపథ్యంలో ఏకంగా ఒక్క పోస్ట్ కి 11 కోట్ల రూపాయల వరకు తీసుకుంటాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. వామ్మో కోహ్లీ ఒక్క పోస్టుకే ఇంత సంపాదిస్తున్నాడు అంటే మామూలోడు కాదు అంటూ అందరూ అతని గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారూ. ఇలా కోహ్లీ ఒక పోస్ట్ కి 11 కోట్లు తీసుకుంటున్నాడు అన్న వార్త గింగిరాల తిరుగుతూ ప్రపంచం మొత్తం చుట్టేసింది. చివరికి విరాట్ కోహ్లీ కంటపడింది ఈ వార్త. దీంతో తన గురించి వస్తున్న వార్త గురించి అసలు విషయం ఏంటి అన్న దానిపై క్లారిటీ ఇచ్చాడు కోహ్లీ.
నా సోషల్ మీడియా సంపాదన గురించి ప్రచారం అవుతున్న వార్త ఏమాత్రం నిజం కాదు అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. జీవితంలో నేను సాధించిన విజయాలు అన్నింటికీ కూడా మీకు రుణపడి ఉన్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు విరాట్ కోహ్లీ. దీంతో ఇంస్టాగ్రామ్ లో ఒక్క కమర్షియల్ పోస్ట్ కి 11 కోట్లు తీసుకుంటాడు అన్న వార్త నిజం కాదు అన్న విషయంపై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది అని చెప్పాలి. కాగా ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతూ ఉన్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి