ఆడపిల్ల కనిపించింది అంటే చాలు మగాడిలో ఉన్న మృగం బయటికి వచ్చి దారుణంగా అత్యాచారాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. దీంతో ఇలాంటి ఘటనలు అటు ఆడపిల్లల భద్రతను రోజురోజుకు ప్రశ్నార్థకంగా మార్చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.
అయితే ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కామాంధులు తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు రాక్షసుల్లా మారిపోతున్న మనుషులు చివరికి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అంతటితో ఆగకుండా దారుణంగా ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో కూడా కాస్తయిన జాలి దయ చూపించడం లేదు కామంతో కళ్ళు మూసుకుపోయిన మానవ మృగాలు. పెద్దపల్లి జిల్లాలో అయితే ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
అప్పన పేటలో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ కు చెందిన మహిళలు బాలికపై రెండు రోజులు క్రితం రియల్ ఎస్టేట్ వెంచర్ లో కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే తీవ్ర గాయాలు పాలైన మైనర్ ను మధ్యప్రదేశ్ తరలిస్తున్న క్రమంలో చివరికి ఆ బాలిక ప్రాణాలు వదిలింది. ఈ క్రమంలోనే ఈ విషయం బయటకి రాకుండా గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి