అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టి దశాబ్ద కాలం కలిసిగడిచిపోతున్న అటు విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా ఎంతో కసిగానే.. ఏదో నిరూపించుకోవాలి అన్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీలో ఉన్న ఇలాంటి దూకుడు తనకు ఎంతో ఇష్టం అంటూ చెబుతున్నాడో పాకిస్తాన్ మాజీ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్. విపత్కర పరిస్థితుల్లో కూడా పట్టు వీడని విధంగా అద్భుతంగా ఆకట్టుకుంటున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. కెప్టెన్గా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ జట్లను వారి సొంత గడ్డపై ఓడించిన విరాట్ కోహ్లీ స్లీడ్జింగ్ కూడా అదే తరహాలో తిప్పి కొట్టాడు అన్న విషయాన్ని గుర్తు చేశాడు.
కోహ్లీ ఎలాంటి సవాలు నైనా స్వీకరిస్తాడని.. అది తనకు బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చాడు ఈ ఆటగాడు.అయితే ఆసియా కప్ 2023 టోర్న నేపథ్యంలో ఒక ఛానల్ తో మాట్లాడిన ఇమాముల్ హక్ ఇలా ప్రశంసలు కురిపించాడు. అయితే ప్రస్తుతం శ్రీలంక వేదికగా ఆఫ్గనిస్తాన్తో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఇమామ్ ఉల్ హక్ మంచి అద్భుత ప్రదర్శన చేశాడు. అదే సమయంలో ఇక పాకిస్తాన్ వన్డే క్రికెట్ టీం ను చూసి ప్రత్యర్థి జట్లు సైతం భయపడుతున్నాయి అని ఇమామ్ ఉల్ హక్ తెలిపాడు. ఇక భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ సహా ఆసియా కప్ గురించి పెదగా టెన్షన్ పడటం లేదు అంటూ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి