మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత అటు విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇక మూడు ఫార్మట్లలో కూడా భారత జట్టుకు ఎన్నో అద్వితీయమైన విజయాలను అందించాడు. ఒక ఐసీసీ టోపీ గెలవలేదు అన్న వంక తప్ప కోహ్లీ కెప్టెన్సీకి మరో వంక పెట్టే అవకాశం కూడా లేదు. కానీ ఎందుకో విరాట్ కోహ్లీతో పోల్చి చూస్తే అటు ధోనినే బెస్ట్ కెప్టెన్ అని.. అతను ఒక దిగ్గజమని చెబుతూ ఉంటారు. దీనికంతటికి కారణం ధోని భారత జట్టుకు రెండుసార్లు ఐసీసీ ట్రోఫీలు గెలిపించి పెట్టడమే.


 ఇలా ద్వైపాక్షిక సిరీస్ లు ఎన్ని గెలిచాం అన్నది కాదు.. ఇక ఐసిసి ర్యాంకింగ్స్ లో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు.. వరల్డ్ కప్ ట్రోఫీ కెప్టెన్ గా జట్టుకు అందించామా లేదా అన్నదే ప్రేక్షకులు చూస్తారు. విరాట్ కోహ్లీ ఇలాంటి ఐసీసీ ట్రోఫీ గెలిపించకపోవడం కారణంగానే విమర్శలు వచ్చాయని ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఇక ఈ ఏడాది భారత్ వేదికగా వరల్డ్ కప్ జరగబోతుంది. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ కావడంతో టీమ్ ఇండియా పై అంచనాలు ఊహకందని రీతిలో ఉన్నాయి.



 సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ లో కెప్టెన్గా రోహిత్ శర్మ జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపించడంలో సక్సెస్ అవుతాడా లేదా అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ఇదే విషయం గురించి టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగా టోర్నీలో జట్టును విజేతగా నిలిపిన  కెప్టెన్నే అందరూ గుర్తుపెట్టుకుంటారని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.  ఇక రాబోయే రెండు టోర్నిలలో భారత్ ను విజేతగా నిలిపితే రోహిత్ గొప్ప కెప్టెన్ల జాబితాలోకి చేరుతాడని చెప్పుకొచ్చాడు.  అయితే రోహిత్ కి ఆ సత్తా ఉంది అంటూ తెలిపాడు. అద్భుతమైన టాలెంట్ ఉన్న జట్టు ఉన్నప్పటికీ కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రావాలి అంటూ చెప్పుకొచ్చాడు గవాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి: