
కెంట్ జట్టు తరఫున తొలిసారి కౌంటి క్రికెట్లోకి అడుగు పెట్టాడు. అయితే భారత జట్టులో చోటుకు నోచుకోలేకపోయిన చాహల్ అటు కౌంటి క్రికెట్లో మాత్రం తన స్పిన్ సత్తా ఏంటో చూపించాడు. ఇటీవల నాటింగ్ హామ్ తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టి తనను వద్దన్న వారికి సరైన సమాధానమే చెప్పాడు అని చెప్పాలి. ఇటీవల జరిగిన మ్యాచ్లో 29 ఓవర్లు వేసిన చాహల్.. ఇక మూడు వికెట్లు తీయడమే కాదు.. 10 మేడిన్ ఓవర్లు కూడా వేయడం గమనార్హం. ఇక తన స్పెల్ లో 63 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే చాహల్ తన స్పిన్ బౌలింగ్ తో లిండన్ జేమ్స్ ని క్లీన్ బౌల్డ్ చేసిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలిత బ్యాటింగ్ చేసిన కెంట్ పది వికెట్లు కోల్పోయి.. 446 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నాటింగ్ హామ్ జట్టు 265 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో అటు కెంట్ జట్టుకి భారీ ఆదిక్యం లభించింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్న చాహల్.. టీమిండియా తరఫున వన్డే ఫార్మాట్లో 72 మ్యాచ్ లలో 5.27 ఎకానమీతో 121 వికెట్లు పడగొట్టాడు ఇక టి20 ఫార్మాట్లో 80 మ్యాచ్లలో 96 వికెట్లు తీసి అదరగొట్టాడు. అయినప్పటికీ అతనికి భారత జట్టులో చోటు దక్కలేదు.