అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని గురించి భారత క్రికెట్లో అందరూ కూడా ఎంతో గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒక్క మాజీ క్రికెటర్ మాత్రం ధోనీని విమర్శించడమే పనిగా పెట్టుకుంటూ ఉంటాడు. ఆ మాజీ క్రికెటర్ ఎవరో కాదు గౌతమ్ గంభీర్. ఒకప్పుడు భారత జట్టుకు డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ గా ఉన్న గౌతమ్ గంభీర్ ఇక టీమిండియా కు ఎన్నో అద్వితీయమైన విజయాలను అందించాడు. ఇక ధోని కెప్టెన్సీలో అతను రెండు వరల్డ్ కప్ లు గెలవడంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. అలాంటి గంభీర్ ఏకంగా ధోనిపై విమర్శలు చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇక ధోని గురించి గంభీర్ ఎప్పుడైనా పాజిటివ్గా మాట్లాడాడు అంటే చాలు అందరూ షాక్ అవుతూ ఉంటారు.
ఇక ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఇదే చేశాడు మహేంద్రసింగ్ ధోని పై ఏకంగా ప్రశంసలు కురిపించాడు. ఒక కెప్టెన్గా టీం ని నడిపించేందుకు ధోని ప్రాధాన్యత ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీ వల్ల ఒక బ్యాటర్ గా తాను సాధించిన రికార్డులను ధోని పొందలేకపోయాడు అంటూ గంభీర్ వ్యాఖ్యానించాడు. ఒకవేళ ధోని కెప్టెన్ కాకపోయి ఉంటే నెంబర్ త్రీ పొజిషన్లో ఆడేవాడు. ఇక పలు వన్డే రికార్డులను బద్దలు కొట్టేవాడు. అయితే కెప్టెన్ గా ఎన్నో ట్రోఫీలు సాధించిన.. ఒక బ్యాట్స్మెన్ గా మాత్రం అతను ఎన్నో పరుగులను త్యాగం చేశాడు అంటూ గౌతం గంభీర్ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి