మరికొన్ని రోజుల్లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ ప్రపంచ కప్ టోర్నీ ఆరంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఈ వరల్డ్ కప్ గురించి చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఈ ఏడాది జరగబోయే వరల్డ్ కప్పులో అత్యుత్తమ ప్రదర్శన చేయబోయే టీమ్స్ ఏవి అనే విషయం గురించి ఎంతో మంది మాజీ ఆటగాళ్లు రివ్యూలు ఇస్తున్నారు. ఇక మరోవైపు ఏ ఆటగాళ్లు వ్యక్తిగతంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తారనే విషయం కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది.


 అయితే కొంతమంది మాజీ ఆటగాళ్లు మరికొన్ని రోజుల్లో జరగబోయే వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకొంతమంది మాజీ ఆటగాళ్లు మాత్రం ఇక ఇప్పటివరకు జరిగిన ప్రపంచ కప్పులలో ఎవరు అత్యుత్తమ ప్రదర్శన చేశారు అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే వన్డే ప్రపంచ కప్లలో ఇప్పటివరకు అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్  ఎవరు అన్నది ఆ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ లిస్టు చూసుకుంటే ఈ జాబితాలో టాప్ ఫైవ్ లో భారత్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు.


 రోహిత్ శర్మ : టీమిండియా సారధి రోహిత్ శర్మ ఆడింది ఇప్పటివరకు రెండు ప్రపంచ కప్ లు మాత్రమే. కానీ ఎక్కువ ప్రపంచకప్ లు ఆడిన ప్లేయర్లకు సాధ్యం కాని రికార్డును రోహిత్ సృష్టించాడు. వరల్డ్ కప్ అంటే పూనకం వచ్చినట్టుగా ఊగిపోతూ ఉంటాడు. ఏకంగా హిట్ మ్యాన్ ఖాతాలో ఆరు శతకాలు ఉన్నాయి. ఇలా వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా రోహిత్ కొనసాగుతున్నాడు.

 సచిన్ టెండూల్కర్ : భారత క్రికెట్ దేవుడిగా కొనసాగుతున్న సచిన్ టెండుల్కర్.. తన కెరియర్లో సుదీర్ఘంగా ఆరు వన్డే ప్రపంచ కప్ లు ఆడాడు. అయితే వన్డే ప్రపంచ కప్ లలో అత్యధిక పరుగులు చేసిన వారిలో సచిన్ దరిదాపుల్లో  కూడా ఎవరూ లేరు. అయితే సచిన్ ఖాతాలో కూడా ఆరు శతకాలు 15 అర్థ శతకాలు ఉన్నాయి అని చెప్పాలి.


 ఇక ఈ లిస్టులో అటు శ్రీలంక దిగజ బ్యాట్స్మెన్ కుమార సంగకర ఉన్నాడు. ఏకంగా కుమార సంగకర వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఐదు శతకాలు బాధిన క్రికెటర్ గా ఉన్నాడు. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియా లెజెండ్ రికి పాంటింగ్ ఐదు సెంచరీలు కొట్టాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ ఓపెన్ డేవిడ్ వార్నర్ ప్రపంచ కప్ టోర్నీలో నాలుగు సెంచరీలు చేసి ఇక టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc