
ఇలాంటి సమయం లో కొన్ని జట్లకు మాత్రం కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి ఊహించని షాక్ లు తగులుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే అటు చాలా జట్లకు ఆటగాళ్లు గాయం బారిన పడి జట్టుకు దూరమవుతూ ఉంటే.. అటు బంగ్లాదేశ్ జట్టు లో మాత్రం వింతైన పరిస్థితి నెలకొంది. జట్టు లో గాయం మారిన పడి ఆటగాళ్లు దూరం గా ఉండడం కాదు.. కీలక ప్లేయర్స్ మధ్య విభేదాలు నెలకొన్నాయి అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే.. వరల్డ్ కప్ ప్రారంభానికి మందు బంగ్లాదేశ్ జట్టు లో గందరగోళమైన పరిస్థితి నెలకొంది అని చెప్పాలి.
ప్రస్తుతం బంగ్లాదేశ్ జట్టులో సీనియర్ ప్లేయర్లుగా కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న తమీమ్ ఇక్బాల్, షాకీబ్ ఉల్ హసన్ మధ్య విభేదాలు తారాస్థాయికు చేరినట్లు తెలుస్తోంది. సరైన ఫిట్నెస్ తో లేని కారణంగా తమీమ్ ఇక్బాల్ ను వరల్డ్ కప్ జట్టులోకి ఎంపిక చేయొద్దు అని పట్టు పట్టాడు. అదే సమయంలో వరల్డ్ కప్ కోసమే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సైతం వెనక్కి తీసుకున్నాడు. ఇలా దీంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. కాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఈ ఇద్దరితో భేటీ అయినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి