ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా వన్డే వరల్డ్ కప్ గురించే చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ ను ఎంజాయ్ చేసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధం అయిపోయారు. అయితే ఇక ఇప్పటికే అన్ని టీమ్స్ కూడా అటు భారత గడ్డపై అడుగుపెట్టి.. ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్లలో మునిగి తేలుతున్నాయి అని చెప్పాలి.


 అయితే గత కొన్ని రోజుల నుంచి వరల్డ్ కప్ గురించి చర్చ జరుగుతూ ఉండగా ఆ చర్చ ఇప్పుడు మరింత ఎక్కువైపోయింది. ఎందుకంటే వరల్డ్ కప్ లో ఏ టీం ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఎంతోమంది మాజీ క్రికెటర్లు రివ్యూల మీద రివ్యూ ఇస్తూ ఉన్నారు. ఏ ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డును అందుకుంటారు అనే విషయాన్ని కూడా ముందుగానే అంచనా వేస్తున్నారు మాజీ క్రికెటర్లు. అదే సమయంలో కొంతమంది ఇక వరల్డ్ కప్ లో కొంతమంది లెజెండ్స్ సాధించిన బ్రేక్ అవ్వని రికార్డుల గురించి చర్చించుకుంటూ ఉండడం గమనార్హం.


అయితే వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేకపోయినా కొన్ని అరుదైన రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


 2003 ప్రపంచ కప్ లో 11 మ్యాచ్ లలో సచిన్ 673  పరుగులు చేయగా ఇదే అత్యధిక పరుగులుగా కొనసాగుతుంది. అయితే ఇక ఈ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.


 ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక వికెట్లు {71) పడగొట్టిన ప్లేయర్గా గ్లెన్ మెక్ గ్రాత్  కొనసాగుతున్నారు.


 ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా వెస్టిండీస్దిగ్గజం క్రిస్ గేల్ కొనసాగుతున్నారు. ప్రపంచ కప్లో ఈ విధ్వంసకర బ్యాట్స్మెన్ 49 సిక్సర్లు బాదాడు.

 వరల్డ్ కప్ టోర్నీలో అత్యంత స్లో ఇన్నింగ్స్ ఆడిన ప్లేయర్గా సునీల్ గవాస్కర్ కొనసాగుతున్నాడు. ఏకంగా 174 బంతుల్లో 36 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా ఈ రికార్డును బ్రేక్ చేయలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc