ముఖ్యంగా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఏదైనా విషయం తెర మీదకి వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు టీమ్ ఇండియాలోని ఒక స్టార్ క్రికెటర్ విడాకులు తీసుకున్నాడు అని వార్త వైరల్ గా మారిపోయింది. అదేంటి ఎవరు విడాకులు తీసుకున్నారు అని తెలుసుకోవడానికి కాస్త ఆతృతగా ఉన్నారు కదా. అయితే ఇప్పుడు విడాకులు తీసుకుంది ఎవరో కాదు మనందరికీ తెలిసిన శిఖర్ ధావన్. అదేంటి వాళ్ళు ఎప్పుడో విడాకులు తీసుకున్నారు కదా అంటారా.. అయితే వాళ్ళు ఎప్పుడో విడాకుల నిర్ణయం సోషల్ మీడియాలో ప్రకటించిన ఇక ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది మాత్రం ఇప్పుడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ శేఖర్ ధావన్ కు ఢిల్లీలోని ఫ్యామిలీ కొట్టు ఇటీవల విడాకులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. భార్య ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా హింసించింది అని ధావన్ వాదనలను కోర్టు సమర్ధించింది. ఒక్కగానొక్క కుమారుడితో కొన్నాళ్లపాటు విడిగా ఉండాలని భార్య ఒత్తిడి చేయడంతో.. ధావన్ మానసిక వేదనకు గురయ్యాడు అంటూ పేర్కొంది. ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడిని కలిసేందుకు. ఇక సెలవుల్లోఇంటికి తీసుకొచ్చుకునేందుకు అటు కోర్టు ధావన్ కు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి