న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ బెయిర్ స్టో అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్ లో ట్రెంట్ బోల్డ్ వేసిన రెండో బతినే బెయిర్ స్టో సిక్సర్ కొట్టాడు. దీంతో వన్డే వరల్డ్ కప్ లో సిక్సర్ తో స్కోర్ బోర్డు ఖాతా తెరిచిన ఆటగాడిగా బెయిర్ స్టో చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్ కప్ లో ఇప్పటివరకు చరిత్ర లో ఎవరూ ఇలా సిక్సర్ తో ఖాతా తెరవ లేదు. దీంతో ఇది ఒక అరుదైన రికార్డుగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ 282 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను ముగించింది.
అయితే న్యూజిలాండ్ జట్టు కేవలం 36.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటర్ కాన్వే 121 బంతుల్లో 152 పపరుగులు చేయగా.. రచిన్ రవీంద్ర 96 బంతుల్ో 123 పరుగులు చేశాడు. దీంతో కివీస్ సునాయాసం గా విజయం సాధించింది. అయితే ఇంగ్లాండ్ జట్టు లో 11 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోర్ చేశారు. వన్డే వరల్డ్ కప్ లో ఇలా చేయడం ఇదే తొలిసారి అని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో జానీ బెయిర్ స్ట్రో గురుంచే అందరూ చర్చించు కుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి