దీంతో రోహిత్ ఈ వరల్డ్ కప్ లో ఎలా రాణిస్తాడో అనే ఆందోళన అందరిలో నిండిపోయింది. అయితే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండో మ్యాచ్లో మాత్రం రోహిత్ తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించాడు. ఏకంగా సెంచరీ తో చేలరేగిపోయాడు. 63 బంతుల్లోనే సెంచరీ చేశాడు మొత్తంగా ఈ మ్యాచ్ లో 131 పరుగులు చేసి ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. దీంతో ఇక రోహిత్ బ్యాటింగ్ చూసి అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఇక ఇటీవలే పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోను రోహిత్ పాక్ బౌలర్లతో చెడుగుడు ఆడేసాడు.
క్రీజు లోకి వచ్చినప్పటి నుంచి సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయిన రోహిత్ శర్మ ఏకంగా 86 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు రోహిత్ శర్మ. మెగా టోర్నీలో విజయవంతమైన చేదనల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా హిట్ మ్యాన్ నిలిచాడు. తొమ్మిది ఇన్నింగ్స్ లో రోహిత్ 586 పరుగులు చేయగా.. ఆ తర్వాత స్థానంలో రికీ పాంటింగ్ 519, మార్టిన్ గాప్తిల్ 504, గిల్ క్రిస్ట్ 498 పరుగులతో ఉన్నారు. వన్డే వరల్డ్ కప్ లో 5 లేదా అంతకంటే ఎక్కువసార్లు సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ ల జాబితాలో రోహిత్ మూడు సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి