ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన కొన్ని టీమ్స్ చెత్త ప్రదర్శనతో తీవ్రంగా నిరాశ పరుస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే  అభిమానులు అంచనాలను అందుకోలేక వరుసగా మ్యాచ్లలో ఓడిపోతూ ఉన్నాయి  ప్రత్యర్ధులకు కనీస పోటీ ఇవ్వలేక చివరికి చెత్త రికార్డులను ఖాతాలో వేసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలా ఈ ఏడాది వరల్డ్ కప్ లో అత్యంత దారుణమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న టీం ఏదైనా ఉంది అంటే అది శ్రీలంక  అని చెప్పాలి. వరల్డ్ కప్ కి ముందు శ్రీలంక టైటిల్ ఫేవరెట్ లలో ఒకటి.


 వరల్డ్ కప్ లో వరుస విజయాలు సాధిస్తూ అద్భుతంగా రాణిస్తుంది అని అందరూ అనుకున్నారు. సెమీఫైనల్కు తప్పక క్వాలిఫై అవుతుంది అని అందరూ అంచనాలు కూడా పెట్టుకున్నారు. కానీ మొదటి మ్యాచ్ నుంచి కూడా అందరి అంచనాలను శ్రీలంక తారుమారు చేసేస్తూ ఉంది అని చెప్పాలి. వరుసగా పరాజయాలు పాలవుతూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది. ఇక ఇటీవల శ్రీలంక చేతిలో దారుణ ఓటమి చవిచూసి ఒక చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన శ్రీలంక జట్టు.. మూడింటిలో కూడా పరాజయం పాలు కావడం గమనార్హం. అయితే ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో ఒక చెత్త రికార్డు పాకిస్తాన్ టీం ఖాతాలో చేరిపోయింది.


 వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక మ్యాచ్లు ఓడిపోయిన జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇప్పటివరకు శ్రీలంక వన్డే వరల్డ్ కప్ లో 42 సార్లు ఓడిపోయింది అని చెప్పాలి. అయితే గతంలో ఈ రికార్డు జింబాబ్వే పేరిట ఉండేది. ఇక ఇప్పుడు శ్రీలంక 42 ఓటములతో జింబాబ్వే రికార్డును సమం చేసింది అని చెప్పాలి. ఇక ఈ లిస్టులో శ్రీలంక, జింబాబ్వే తర్వాత వెస్టిండీస్ 35, ఇంగ్లాండ్ 34 ఉన్నాయ్. అయితే వరల్డ్ కప్ చరిత్రలో శ్రీలంకపై ఆస్ట్రేలియా ఆదిపత్యం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వరకు శ్రీలంకతో జరిగిన తొమ్మిది వరల్డ్ కప్ మ్యాచ్లలోను ఆస్ట్రేలియానే విజయం సాధించింది. దీంతో వరల్డ్ కప్ లో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన టీమ్ గా ఆస్ట్రేలియా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc