భారత జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ కూల్ నెస్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. గతంలో భారత జట్టుకు ఆడుతున్నప్పుడు ఇక రిటైర్మెంట్ ప్రకటించి కోచ్గా అవతారం ఎత్తిన సమయంలోనూ.. ప్రతి విషయం లో ఎంతో కూల్ గా ఉంటూ వస్తున్నాడు. అందుకే అటు రాహుల్ ద్రావిడ్ని మిస్టర్ డిపెండబుల్ అని పిలుస్తూ ఉంటారు అభిమానులు. అయితే ఇలా ఎప్పుడు ప్రశాంతంగా ఉండే రాహుల్ ద్రవిడ్ కు ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పై కోపం వచ్చింది


 దీనికి కారణం వరల్డ్ కప్ లో భాగంగా పలు మ్యాచ్లు జరిగిన పిచ్ లకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తక్కువ రేటింగ్ ఇవ్వడమె. చెన్నై వేదికగా ఆస్ట్రేలియా, భారత్ తలబడగా.. అహ్మదాబాద్ లో భారత్, పాకిస్తాన్ జట్లు ఢీకొన్నాయ్. అయితే ఈ రెండు మ్యాచ్ లు జరిగిన పిచ్ లకు యావరేజ్ రేటింగ్ ఇచ్చింది ఐసీసీ. అయితే దీనిపై రాహుల్ ద్రావిడు అసహనం వ్యక్తం చేశాడు. కేవలం హై స్కోరింగ్ మ్యాచ్ లపైనే ఫోకస్ పెట్టి ఆయా పిచ్ లకి మంచి రేటింగ్ ఇవ్వడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు. వన్డేల్లో అలా చేయకూడదు అంటూ సూచించాడు. ఈ రెండు మ్యాచ్లలో కూడా భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.


 కానీ ఈ రెండు పిచ్ లకు తక్కువ రేటింగ్ ఇచ్చారు. అవి చాలా మంచి వికెట్లు అని నా ఫీలింగ్ అంటూ రాహుల్ ద్రావిడ్ చెప్పుకొచ్చాడు. మంచి పిచ్ అని అనిపించాలి అంటే భారీ స్కోర్ నమోదు అవ్వాలి అనే ఆలోచన తప్పు అంటూ అభిప్రాయపడ్డాడు ఈ క్రికెట్ లెజెండ్. స్పిన్ బౌలింగ్, స్ట్రైక్ రొటేషన్, ఎఫెక్టివ్ బ్యాటింగ్ ఇలా ఎన్నో స్కిల్స్ ని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు  అన్నింటిని వదిలేసి సిక్సర్లు పోర్ల మీదనే పిచ్ రేటింగ్ ను ఇవ్వడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు. బ్యాట్స్మెన్లకు అనుకూలంగా పిచ్ లు తయారు చేస్తే ఇక బౌలర్లు జట్టులో ఉండి ఎందుకు.. జట్టులో వాళ్ళ పాత్ర తగ్గిపోతుంది అంటూ అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc